మలయాళ సూపర్‌స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salman) హీరోగా నేరుగా తెలుగులో నటిస్తోన్న మొదటి చిత్రం సీతారామం (Sita Ramam).

యుద్ధంతో రాసిన ప్రేమకథ ట్యాగ్‌లైన్‌. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

అక్కినేని సుమంత్, డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌, ప్రకాశ్‌రాజ్‌, భూమిక చావ్లా, తరుణ్‌భాస్కర్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఫీల్‌గుడ్‌ సినిమాలతో ఆకట్టుకునే హను రాఘవవూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కు పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు డార్లింగ్‌.. మాకు సినిమా థియేటరే గుడి. ఆ గుడి కూడా ప్రేక్షకులు ఇచ్చిందే..

ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? ఈ సినిమా కూడా అంతే.. అన్నారు