యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ మారారు.
ఆయన ప్రస్తుతం వరస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీ తెరకెక్కుతోంది.
ఈ చిత్రం ప్రకటన వచ్చినప్పటి నుండే సలార్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇంటర్వ్యూలో దేవరాజ్ మాట్లాడుతూ తన క్యారెక్టర్ మొదటి భాగంలో కన్నా, రెండవ భాగంలో హైలైట్ గా ఉంటుందని వెల్లడించారు.
దేవరాజ్ రెండవ భాగంలో నా పాత్ర హైలెట్ అనడంతో సలార్’ మూవీ రెండు పార్ట్స్ గా తీస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరో పేరు కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది.
సలార్ లో హీరో పేరు ‘దేవా’ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.