‘కస్టడీ’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గున్నారు నాగచైతన్య.
ఆ ఇంటర్వ్యూలో విలేకరి ఆయనను ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్ గురించి అడిగారు.
దీనిపై స్పందించిన అయన ‘ఏ మాయ చేసావె’ సినిమాలోనే తాను ఫస్ట్ టైమ్ ఆన్‌స్క్రీన్ కిస్ సీన్‌లో నటించినట్లు తెలిపారు.
‘‘ఆరు లేదా ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ క్లాస్‌మేట్‌ని ఇష్టపడ్డాను. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ డేట్ కోసం కాఫీ షాప్‌కు వెళ్లాను.
ఆన్‌స్క్రీన్ ఫస్ట్ కిస్ ‘ఏమాయ చేసావె’ సినిమాలో జరిగింది. ఆఫ్‌స్క్రీన్‌లో ఎప్పుడు అనేది చెప్పాలనుకోవడం లేదు.
ఒక అమ్మాయిలో నేను మొదట గమనించేది.. ఆమె వ్యక్తిత్వాన్ని. అలాగే, నేను ఒంటరితనాన్ని కొన్నిసార్లు ఇష్టపడుతుంటాను.
అలా ఉన్నప్పుడే మన గురించి మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. మంచి ఆలోచనలు పుడతాయి.
జీవితంలో మరింత బ్యాలెన్స్‌గా ఉండేందుకు అవి ఉపయోగపడతాయి’’ అని సమాధానం ఇచ్చారు నాగచైతన్య.