తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌ని కూడా దాటేస్తుంటే.. తమిళ తంబీలు మాత్రం ఓన్లీ రీజినల్‌ అంటూ మడికట్టుకు కూర్చుకుంటున్నారు.

తమకు కాస్త మార్కెట్‌ ఉన్న టాలీవుడ్ మార్కెట్ విషయంలో కూడా సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ చేయటం లేదు.

తాజాగా హీరో కార్తీ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు.

తమిళ హీరోల్లో మొన్నటి వరకు తెలుగు మార్కెట్‌ను సీరియస్‌గా ఫోకస్‌ చేశారు నటుడు కార్తీ.

కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచే తెలుగు, తమిళ మార్కెట్‌లను బ్యాలెన్స్ చేస్తున్న ఈ యంగ్ హీరో..

తన ప్రతీ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు.

లాస్ట్ మినిట్‌ వరకు తెలుగు రిలీజ్‌ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా.. సడన్‌గా సినిమాను ఆడియన్స్‌ ముందుకు తీసుకువస్తున్నారు..