‘ఊపిరి’, ‘ఖైదీ’ లాంటి బ్లాక్ బూస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కార్తి.

ఇటీవలే విడుదలైన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ చిత్రంలో  ఓ కీలక పాత్రలో కార్తి నటించి మెప్పించారు.

ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జపాన్‌’.

ఈ చిత్రంలో విచిత్రమైన వేషధారణతో విడుదలైన కార్తి ఫొటోలు  ఆకట్టుకున్నవిషయం తెలిసిందే.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఈ షెడ్యూల్లో కార్తితోపాటు పోలీస్‌ గెటప్పుల్లో ఉన్న కొంతమంది ఆర్టిస్టులపై కీలక ఫైట్ ఘట్టాల్ని రూపొందిస్తున్నారు.

రాజు మురుగున్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో కార్తికి జోడిగా అను ఇమ్యాన్యుయేల్‌ నటిస్తోంది.