ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో అనన్య పాండే (Ananya Panday) ఒకరు.
అతి తక్కువ సమయంలోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. ఇటీవల లైగర్ తో సౌత్ కు పరిచయమైంది.
అయితే అనన్య .. బీటౌన్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.
కానీ కొద్దిరోజుల క్రితం వీరిద్దరు విడిపోయినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని యువ హీరో ఇషాన్ కాఫీ విత్ కరణ్ షోలో స్పష్టం చేశారు.
కేవలం కరణ్ జోహర్ నిర్వహిస్తున్న ఈ షో వల్లే తాము విడిపోయామని చెప్పుకొచ్చాడు.
ఇటీవల మీరు అనన్యతో విడిపోయారా ? అని కరణ్ అడగ్గా.. మేము విడిపోలేదు. ఆమె నాతో విడిపోయింది.
ప్రస్తుతం నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నాను. జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని ఆశిస్తున్నాను.