మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించిన దుల్కర్.సీతారామం తో మరింత దగ్గరయ్యారు.
సీతారామం తో హిట్ అందుకున్న దుల్కర్ కు తెలుగులో కూడా సినిమాలు క్యూ కడుతున్నాయి.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ప్రాజెక్టు K’ అనే సినిమా తెరకెక్కుతోంది.
అయితే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు అంటూ టాక్
ప్రాజెక్టు K లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, బిగ్ బీ అమితా బచ్చన్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు సోషిస్తున్నారు.
దీనిపై అధికారక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.