హీరోయిన్‌ రష్మిక హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

కొన్నిసార్లు ఈ ఇద్దరూ విమానాశ్రయంలో కలిసి కనిపించడం ఈ వార్తలకు దారితీసింది.

తాజాగా ‘ఛత్రపతి’  భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్‌ దీనిపై స్పందించారు.

అయన మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేనూ రష్మిక మంచి స్నేహితులం.

మేమిద్దరం హైదరాబాద్‌కు చెందిన వాళ్లం కావడంతో షూటింగ్‌ పనుల మీద తరచూ ముంబయికి వెళ్తుంటాం.

అలా వెళ్లేటప్పుడు ఎయిర్‌పోర్టులో కలుసుకుంటాం. అలా అనుకోకుండా కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ.

అంత మాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా..? ఈ వార్తలన్నీ రూమర్స్‌ మాత్రమే’’ అని కొట్టిపడేసారు.

కాగా తెలుగు ‘ఛత్రపతి’కి హిందీ రీమేక్‌గా వస్తున్న ‘ఛత్రపతి’ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.