సాధరణంగా చాలా మందికి ఆహారం తీసుకునేప్పుడు.. అన్నం తింటున్నప్పుడూ నీళ్లు తాగుతుంటారు

కొంతమంది తినెప్పుడు నీళ్లు తాగకూడదు అని చెబుతుంటారు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరమని కూడా చెబుతుంటారు

మరీ ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా

భోజనానికి ముందు నీరు తాగడం వలన శరీరం బలహీనంగా మారిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు

అలాగే భోజనం చేసిన వెంటనే నీరు ఎక్కువగా త్రాగడం వలన స్థూలకాయానికి దారితీస్తుందని అంటున్నారు

భోజన సమయంలో ఎక్కువగా నీళ్లు తాగడం సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లు తాగే విషయంలో మనం అనుసరించాల్సిన మార్గాలు కొన్ని ఉన్నాయి

భోజనం చేసే సమయంలో సిప్ చేస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా నీరు తాగడం వలన తిన్న ఆహారాన్ని జీర్ణక్రియకు వీలుగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది

జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి.. జీవక్రియ రేటు సక్రమంగా ఉండలంటే వెచ్చని నీటిని భోజనం చేసేటప్పుడు తాగాలి