ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ

ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం

ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత

ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం

ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం

ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం

ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్ధం,

ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,

మరొకరి వెతుకులాటలు , అండగా నిలిచిన మనుషులు..

అన్నీ కలిపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..

అదే రామాయణం