ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2023 ‘గ్రూప్ బీ’ టాప్ 2 స్థానాలలో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఫిబ్రవరి 23న సెమీ ఫైనల్ జరుగుతోంది.
అయితే ఈ రెండు జట్ల మధ్య టీ20 ఫార్మాట్‌లో రికార్డులెలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
టీమిండియాపై ఆస్ట్రేలియాకి గొప్ప రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఈ ఇరుజట్ల మధ్య 30 మ్యాచులు జరగాయి.
వీటిలో 22 మ్యాచుల్లో ఆస్ట్రేలియానే గెలిచింది. 7 మ్యాచుల్లో భారత జట్టు గెలవగా..ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది.
ఇంకా ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ ఐదు సార్లు భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి.
ఈ 5 మ్యాచ్‌లలో టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగా, మిగిలిన మూడింటిలో ఆసీస్ జట్టు గెలిచింది.
ఇక ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఆడాలంటే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్‌లో భారత్ తప్పక గెలవాలి.
ఒక వేళ ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్ చేజారితే టీమిండియా ఇంటిబాట పట్టాల్సిందే..!