కౌగిలింతల వల్ల బోలెడన్ని బెనిఫిట్స్.. రోజుకు ఎన్ని అవసరమో తెల్సా!

కొంతమంది సంతోషం లేదా బాధ ఎమోషన్ ఏదైనా కూడా దాన్ని వ్యక్తపరిచేందుకు తమకు ఇష్టమైన వారిని హాగ్ చేసుకుంటుంటారు. 

కౌగిలింతల వల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు. రోజూ కావలసినన్ని హగ్స్ ఇచ్చిపుచ్చుకునేవారిలో స్ట్రెస్ ఉండదని చెబుతున్నారు. 

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని హగ్స్ అవసరం.? కౌగిలింతల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.? 

నిరాశ, నిస్పృహలు అనేవి మనిషి నుంచి దూరం కావాలంటే రోజుకు కనీసం 4 కౌగిలింతలు అవసరమని సైకాలజిస్టులు అంటున్నారు. 

మనం మాటల్లో చెప్పలేని కొన్ని భావాలను హగ్స్ ద్వారా చెప్పవచ్చు అని మానసిక నిపుణుల అభిప్రాయం. కౌగిలింత ద్వారా ఒత్తిడి దూరం అవుతుందని అంటున్నారు. 

ఆప్యాయంగా కౌగిలించుకునేవారు లేకపోతే మానసిక సమస్యలు తలెత్తుతాయని.. అందువల్ల అధిక రక్తపోటు, ఉబ్బసం, మధుమేహం తదితర వ్యాధులు రావొచ్చునని డాక్టర్లు చెబుతున్నారు.