‘కుమారి 21ఎఫ్‌’ (Kumari 21F) సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్‌.

తొలి సినిమాతోనే తన గ్లామర్‌, నటతో మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ.

ఇక ఈ సినిమా విజయంలోనూ హెబ్బా కీ రోల్‌ ప్లే చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

చిత్రమే భారీ విజయం అందుకోవడంతో ఈ అమ్మడుకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.

ఆఫర్లు అయితే వచ్చాయి కానీ మరో కమర్షియల్‌ విజయాన్ని అందుకోలేక పోయింది హెబ్బా.

తాజాగా రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘రెడ్‌’ చిత్రంలో ఐటెం సాంగ్‌తో అలరించిన ఈ చిన్నది మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

ఇదే జోష్‌లో వరుసగా మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.