కుమారి 21ఎఫ్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్‌.

ఫస్ట్‌ సినిమానే అయినా నటనలో మెచ్యూరిటీ చూపించిన ఈ బ్యూటీ నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఓదెల రైల్వే స్టేషన్’, ‘తెలిసినవాళ్లు’, ‘వల్లన్’ చిత్రాల్లో నటిస్తోంది.

‘గతంలో నేను కూడా డేటింగ్ చేశాను. ఆ అబ్బాయి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. అయితే తొలి సినిమా విడుదలకు ముందే బ్రేక్‌ అయ్యింది. 

ఆ సమయంలో సినిమాలతో బిజీ కావడంతో బ్రేకప్‌ గురించి ఎక్కువ ఆలోచించలేదు.ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను’

ఇక తనకు కాబోయేవాడు ఎలాంటి వాడు అయ్యుండాలనే ప్రశ్నకు బదులిస్తూ.‘నేను ఊరికే ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. అందుకే తక్కువ మాట్లాడే అబ్బాయి కావాలి.

సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉండాలి. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అస్సలు ఉండకూడదు. నన్ను ప్రేమగా చూసుకోవాలి’ అని పెద్ద జాబితానే ముందు పెట్టింది అందాల తార.