గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి.

మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురి కావడం, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు చెప్పడం వంటి సంకేతాలుగా భావించాలి.

రక్తసరాఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

తరచుగా జలుబు, జ్వరం, దగ్గు వస్తున్న, అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాలి. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే.

గుండె భారంగా, అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

మత్తు లేదా మగతగా ఉన్న, చెమటలు ఎక్కువగా పడుతున్న గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి.

 తీవ్రమైన అలసట, ఒళ్ళు నొప్పులు వస్తున్న అశ్రద్ధ చేయకూడదు.

వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండె నొప్పికి దారితీస్తాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.