ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ ఫుడ్స్ తినడం బెస్ట్..
ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లంగ్స్ బలంగా ఉండటంకోసం సహాయపడే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో కాలుష్యం వల్ల కలిగే ఏదైనా మంట నుంచి ఉపశమనం కల్పించడానికి పాలలో పసుపు కలుపుకుని తాగడం మంచిది.
వాల్నట్స్‌లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్, ఫైటోఈస్ర్టోజెన్‌లె పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
బీటా కెరోటిన్, జియాక్సంథిన్, లుటిన్, క్లోరోఫిల్ వంటి యాంటీఆక్సిడెంట్లు పాలకూరలో ఎక్కువుగ ఆఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
అల్లంలో ఉండే పోషకాలు ఊపిరితిత్తుల వాపు, ఇన్పెక్షన్ తగ్గించడంలో సహాయపడతాయి.
టమోటాలో లైకోపిన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చేస్తుంది. లైకోపిన్ ఉండే ఆహారం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచివి.
విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరి, నిమ్మ, నారింజ మొదలైన ఆహారం తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మరిన్ని వివరాల కోసం వైద్య నిపుణులను సంప్రదించండి