లిప్ లాక్ పెట్టుకుంటున్నారా ??
ఈ రోగాలు రెడీగా ఉన్నట్లే
TV9 Telugu
19 April 2024
ఇద్దరు మనుషులు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ లేదా హగ్ చేసుకుంటారు.. అలానే లవర్స్ కలిసినప్పుడు లిప్ కిస్ లు చేసుకుంటారు.
అయితే ప్రస్తుత కాలంలో ప్రేమికులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా లిప్ టూ లిప్ కిస్ చేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది.
అయితే ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్న పిల్లలను కిస్ చెయ్యడం వల్ల ఫ్లూ, వైరస్‌ల బారిన పడే అవకాశాలు ఉన్నాయట.. అందువల్ల చాలా జాగ్రత్తగా నిపుణులు చెబుతున్నారు.
అలాగే కొన్ని సర్వేల ప్రకారం లిప్ కిస్ లు ఎక్కువగా చెయ్యడం వల్ల థ్రిల్ సంగతి పక్కన పెడితే అలెర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
దానితో పంటి, చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు. అంతే కాదు కొన్ని రకాల నోటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
లిప్ కిస్ వల్ల మోనోన్యూక్లియోసిస్, మెనింజైటిస్ వంటి వైరస్‌లను వ్యాపింపజేస్తుంది.. అంతేకాదు జలుబు దగ్గు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో జర భద్రం.