మీరు అన్ని గంటలపాటు నిద్రపోవాల్సిందే.. లేదంటే మీ గుండె...!
29 October 2023
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా పరిశోధకులు నిద్ర, గుండె పనితీరుపై పరిశోధనలు జరిపారు శాస్త్రవేత్తలు.
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం 7 గంటల నుంచి 9 గంటల వరకు నిద్ర పోవాల్సిందేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మధ్య రాత్రిలో ఎక్కుసార్లు మెలకువ వచ్చినా, నిద్రవేళలో చిన్నపాటి తేడా వచ్చినా గుండె అనారోగ్య సమస్యలు ఖాయం!
మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా మంచి నిద్ర అవసరం అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా 35 మంది ఆరోగ్యంగా ఉన్న మహిళలపై 12 వారాలపాటు కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
నిద్ర సమయంలో మార్పులు రావడం వల్ల వీరి గుండె ఆరోగ్యంపై ప్రభావం పడినట్లు గుర్తించారు యూనివర్సిటీ పరిశోధకులు.
NHS సంస్థ అధ్యయనం ప్రకారం కూడా ప్రతి ఒక్కరికీ రోజుకు 7 గంటల నుంచి 9 గంటల పాటు నిద్ర అవసరమని చెబుతున్నారు.
సో.. తెలిసింది కదా. మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అలవాటు చేసుకోవడం ఉత్తమని అంటున్నారు నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి