ఉప్పు ప్రాణానికి ముప్పు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

TV9 Telugu

18 January 2024

రోజుకు 5 గ్రాములు మించి ఉప్పు వాడకంతో మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు డేంజర్ బెల్స్‌ మోగించింది

ఉప్పు వల్ల శరీరంలో కీలక అవయవాలు దెబ్బతిని ఏటా ప్రపంచవ్యాప్తంగా 18.9 లక్షల మంది చనిపోతున్నారని అంచనా వేసింది.

రక్తపోటు, గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌, స్థూలకాయం, కిడ్నీ వ్యాధులు బారినపడే అవకాశం పెంచుతుందని తెలిపింది.

శరీరంలో ‘సోడియం’ కీలకమే అయినా, రోజుకు 2000 మిల్లీగ్రాములు మించి తీసుకోకూడదని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఒక టేబుల్‌ స్పూన్‌లో సోడియం 2000 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. రోజుకు దీన్ని మించకూడదని అంటున్నారు డబ్ల్యూహెచ్‌వో అనధికారులు.

ఉప్పు వాడకం నుంచి క్రమంగా బయటపడాలి. ఉప్పుకు బదులు నిమ్మరసం, వెనిగర్‌ మొదలైనవి ఆహారంలో వాడొచ్చని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తుంది.

ప్రాసెస్‌ చేసిన ఆహారం మానేయాలనీ తప్పదనుకుంటే 100 నుంచి 120 మిల్లీగ్రాముల వరకు సోడియం ఉన్న ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తీసుకొవచ్చు.

పరిమితికి మించి వాడకంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 18.9 లక్షల మంది మృతి చెందుతున్నారని తెలిపింది డబ్ల్యూహెచ్‌వో.