ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టి పని చేస్తున్నారా.. వెరీ డేంజర్..!
23 Febraury 2024
చాలా మందికి బెడ్‌పై కూర్చుని ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేసే అలవాటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లో చాలా మంది ఇలానే వర్క్ చేస్తున్నారు.
అయితే ఈ చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపై ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు వైద్యారోగ్య నిపుణులు.
మీకు సౌకర్యంగా అనిపించవచ్చు.. కానీ దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు, వైద్యులు.
ల్యాప్‌టాప్ నుండి వచ్చే వేడి గాలి చర్మంపై చికాకును కలిగిస్తుంది. దీనిని టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్ అంటారు. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల చర్మవ్యాధులు వస్తాయి.
పురుషులలో సంతానోత్పత్తి పై ప్రభావం పడుతుంది. దీని వేడి గాలి స్పెర్మ్ కౌంట్, నాణ్యతను తగ్గిస్తుంది. అలానే మహిళలలో ఎగ్ రిలీజ్ సక్రమంగా జరగదు.
ఒడిలో ల్యాప్‌టాప్‌ని పెట్టుకుని మంచంపై అలా వాలి ఎక్కువసేపు పని చేయడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. నిటారుగా కూర్చోవడం సాధ్యం కాక వాలి కూర్చోవాల్సి వస్తుంది.
దీంతో వెన్నుముకపై ఒత్తిడి పడి నొప్పికి దారి తీస్తుంది. అలానే మెడపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై ఉంచి పని చేయడం మంచిది.
అలానే కంటి సంరక్షణ కోసం ప్రతి 20-30 నిమిషాలకు విరామం తీసుకోండి. వీటి ద్వారా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.