"స్పైడర్" కరిస్తే మరిణిస్తారా..?
TV9 Telugu
01 August 2024
స్పైడర్ ఒక రకమైన కీటకం. తెలుగులో సాలీడు అంటారు. వీటిని మన చుట్టుపక్కల, ఇంట్లో తరుచూ చూస్తూనే ఉంటారు.
స్పెయిన్‌కు చెందిన వ్యక్తిని టిక్ అనే స్పైడర్ కాటు వేసింది. నొప్పితో బాధపడుతుండటంతో ఆసుపత్రిలో చేర్చారు.
స్పైడర్ కాటు కారణంగా అతను క్రిమియన్ కాంగో హెమరేజిక్ జ్వరం బారిన పడ్డాడని ఆసుపత్రిలో వైద్యులు చెప్పారు.
ఇది ఎబోలా రకమైన ఓ వ్యాధి. ఈ వ్యాధి సోకి ఆ వ్యక్తి మరణించినట్లు ఆ ఆసుపత్రిలో డాక్టర్లు నిర్ధారించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కాంగో హెమరేజిక్ వైరస్‌ల జాబితాలో చేర్చింది.
2020 తర్వాత స్పెయిన్‌లో ఈ వ్యాధితో మరణించడం ఇదే తొలిసారిని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సమస్య (WHO).
ఈ ఇన్ఫెక్షన్ ను మొట్టమొదట 1950లో కనుగొనడం జరిగింది. ఈ రకమైన వైరస్ చాలా కేసులు బల్గేరియాలో కనిపించాయి.
ఈ వైరస్ ఉన్న రోగి ద్వారా ఇతర వ్యక్తులకు కూడా సోకవచ్చంటున్నారు దీనిపై పరిశోధన జరిపిన వైద్య ఆరోగ్య నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి