అసలు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి.? ఎక్కిళ్లు ఆగాలంటే ఏం చెయ్యాలి.?

Anil Kumar

13 June 2024

మనలో చాలామందికి ఎక్కిళ్లు వస్తుంటాయి. అవి వస్తే ఎవరైనా కావాల్సిన వాళ్లు బాగా తలచుకుంటున్నారని అనుకుంటుంటాం.

అందుకే ఎక్కిళ్లు(Hiccups) వస్తున్నాయని భావిస్తుంటాం. కానీ, శాస్త్రవేత్తలు మాత్రం అసలు విషయాన్ని కనిపెట్టారు.

అసలు ఎక్కిళ్లు ఎక్కడ నుండి వస్తాయి.. అవి రావడానికి కారణంతోపాటు, వాటిని ఎలా నివారించుకోవచ్చు అనేది చూద్దాం.

ఎక్కిళ్లు మన గొంతులో వస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బాడీలోని అసంకల్పిత చర్య వల్ల వస్తున్నట్లు పేర్కొన్నారు.

డయాఫ్రాగమ్ కండరాలు ఒక్కసారిగా కుదింపులకు గురైనప్పుడు.. దానిని నియంత్రించలేరు. అప్పుడు మీకు ఎక్కిళ్లు వస్తాయి. కానీ,

కొంత సమయం తర్వాత ఈ ఎక్కిళ్లు ఆగిపోతాయి. అంతే కాకుండా స్పైసీ ఫుడ్ కూడా ఎక్కిళ్లకు కారణమని భావిస్తున్నారు.

అయితే.. ఎక్కిళ్లు ఆపడానికి కాసేపు మీ శ్వాసను ఆపుతూ ఉండాలి. ఎక్కిళ్లు వచ్చినప్పుడల్లా చల్లటి నీరు తాగవచ్చు.

ఎక్కిళ్లు నిరంతరం వస్తుంటే.. మీ నాలుకను బయటకు పెట్టి నోటిద్వారా శ్వాస తీసుకోవడం ద్వారా ఎక్కిళ్ళను ఆపవచ్చు.

అంతే కాకుండా ఎక్కిళ్ల నుంచి దృష్టి మళ్లించి మరికొంత సేపు ఫోకస్ పెడితే కూడా కాసేపట్లో ఎక్కిళ్లు ఆగిపోతాయి.