శరీరంలో విటమిన్ డి ఎందుకు తగ్గుతుంది?

TV9 Telugu

09 July 2024

ఆరోగ్యంగా ఉండటానికి, పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా లోపం ఉంటె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది.

వీటిలో విటమిన్ డి ఒకటి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో దీని లోపం ఎలా వస్తుందో తెలుసుకుందాం.

నిద్రలేమి, ఎముకల నొప్పి, నిరాశ, కండరాల బలహీనత, ఆకలి లేకపోవటం, చర్మం పాలిపోవటం లేదా తరచుగా జబ్బు పడటం.

శరీరంలో విటమిన్ డి లోపానికి ప్రధాన కారణం ప్రజలు సూర్యరశ్మిలో తక్కువగా ఉండటమేనంటున్నారు వైద్య నిపుణులు.

అదనంగా, కొవ్వు లేని ఆహారం తీసుకోవడం కూడా విటమిన్ డి లోపానికి కారణమవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

కొవ్వు చేపలు, గుడ్డు పచ్చసొన, పాలు లేదా నారింజ రసం వంటి విటమిన్ డి బలవర్ధకమైన ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

మీ శరీరంలో విటమిన్ డి తీవ్రమైన లోపం ఉంటే, మీరు ఆరోగ్య నిపుణుల సలహా మేరకు దాని సప్లిమెంట్లను తీసుకోవచ్చు.

మీ శరీరంలో విటమిన్ డి లోపాన్ని గుర్తించడానికి మీరు ప్రతి 5 నుండి 6 నెలలకు మీ రక్త పరీక్ష చేయించుకోండి.