ఈ సమస్యలు ఉన్న వారు పొరపాటున కూడా లెమన్‌ వాటర్‌ తాగకూడదు..

TV9 Telugu

06 April 2024

నిమ్మకాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. నిమ్మకాయ నీటిలో కలుపుకొని తాగడం వల్ల అనే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ నిమ్మరసంలో తేనె కలుపుకుని లెమన్‌ వాటర్ తాగడం అలవాటుగా చేసుకున్నాం.

అయితే రోజూ పరగడపున నిమ్మరసం ఎక్కువగా పిండుకుని తాగడం కొంతమందికి హాని చేస్తుందని అంటున్నారు నిపుణులు.

పెద్ద మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు లెమన్ వాటర్ తాగకపోవడమే మంచిదంటున్నారు.

దంత సమస్యలు ఉన్నవారు కూడా లెమన్ వాటర్ తాగడం మానుకోవాలి. నిమ్మలోని యాసిడ్.. పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది.

లెమన్ వాటర్‌ బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు పరిమితంగా నిమ్మరసం తాగవచ్చు.

కిడ్నీ వ్యాధితో బాధపడేవారు నిమ్మరసం తాగకూడదు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడేవారు దీనిని పొరపాటున కూడా తీసుకోరాదు.

హార్ట్ బర్న్ సమస్యతో బాధపడేవారు నిమ్మరసం తాగడం మానుకోవాలి. రోజూ తీసుకోవడం వల్ల పెప్టిక్ అల్సర్ సమస్య పెరుగుతుంది.