తెల్ల ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది.?
TV9 Telugu
08 February 2024
ఉల్లిపాయలతో శరీరానికి అనే లాభాలు ఉన్నాయి. మార్కెట్‌లో ఎర్ర ఉల్లితో పాటు తెల్ల ఉల్లిపాయలు కూడా కనిపిస్తుంటాయి.
మరి వీటిలో ఏది బెటర్ అనే ఆలోచన చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ చేస్తుందో తెలుసుకుందాం.
నిజానికి ఎర్ర ఉల్లిపాయలతో పోలిస్తే తెల్ల ఉల్లిపాయల్లోనే ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
పచ్చిగా కానీ, ఉడికించి కానీ తెల్ల ఉల్లిపాయలను తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే శక్తి వీటికి ఉంది.
తెల్ల ఉల్లిపాయలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. వీటిలోని సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.
ఒంట్లో కణితి పెరుగుదలను నిరోధించే సుగుణాలు కూడా తెల్ల ఉల్లిపాయల్లో ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
తెల్ల ఉల్లి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లిపాయ సహాయ పడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి