ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం మంచిదా.. మాంసాహారం మంచిదా..

10 December 2023

ఇటీవల కాలిఫోర్నియాలోని స్టాన్‌పోర్డ్ యూనివ‌ర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

రెండు నెలల పాటు సాగిన ఈ అధ్యయ‌నం యొక్క వివ‌రాలను జామా నెట్‌వ‌ర్క్ ఓపెన్ జ‌ర్నల్‌లో పబ్లిష్‌ చేశారు శాస్త్రవేత్తలు.

కొలెస్ట్రాల్ లెవెల్స్‌, షుగ‌ర్ లెవెల్స్‌, ఇన్సులిన్ లెవెల్స్‌, శ‌రీర బ‌రువు అధారంగా పరిశోధనలు జరిపారు.

అధ్యయ‌నంలో పాల్గొన్న వివిధ రకాల ఆహారం తీసుకునే వారి గుండె పనితీరును ప‌రిశీలించారు స్టాన్‌పోర్డ్ పరిశోధకులు.

ఎనిమిది వారాల ప‌రిశోధ‌న అనంత‌రం వీగన్ డైట్ తీసుకున్న వారిలో కీలక విషయాలు స్టాన్‌పోర్డ్ శాస్త్రవేత్తలు గుర్తించారు.

బ‌రువు త‌గ్గుద‌ల‌, చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుద‌ల‌, ఇన్సులిన్ లెవెల్స్ త‌గ్గుద‌ల‌ను గుర్తించిన‌ట్టు వెల్లడించారు.

మొక్కల ఆధారిత ఆహారంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంద‌ని ఈ అధ్యయనం ద్వారా తెలిసొచ్చిందని ప్రకటించారు పరిశోధకులు.

మొక్కల ఆధారిత ఆహారం విష‌యానికి వ‌స్తే కూర‌గాయ‌లు, ప‌ప్పుధాన్యాలు, న‌ట్స్‌, పండ్లు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.