నిద్రలేమి సమస్య ఉన్న మహిళలకు ఆ ప్రమాదం..

TV9 Telugu

03 August 2024

డెంగ్యూ జ్వరం తగ్గిన కూడా, కొంతమందికి బలహీనత, శ్వాస తీసుకోవడంలో, పని చేయడంలో ఇబ్బంది ఉంటుంది. శరీరానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

పోషకమైన ఆహారం డెంగ్యూ జ్వరాన్ని త్వరగా నయం చేస్తుంది. ప్రొటీన్లు, ఐరన్, పీచు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

తాజా పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి. ఇది శరీరానికి సరైన పోషకాహారాన్ని అందిస్తుంది.

డెంగ్యూ జ్వరం తగ్గిన తర్వాత రోజూ కమలాపండ్లు తినండి. దీన్ని తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శరీరం అలసిపోయి బలహీనంగా మారకూడదు అంటే ప్రతిరోజూ పాలు త్రాగాలి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

నీరు, పండ్ల రసం పుష్కలంగా త్రాగాలి. డైట్‌లో గ్లూకోజ్ వాటర్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, కొబ్బరి నీళ్లు, లెమన్ వాటర్, షర్బత్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

పచ్చి కూరలను తప్పకుండా తినండి. కూరగాయల సూప్ తాగడం కూడా ప్రయోజనకరం. వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి.

ప్రతిరోజు తమ ఆహారంలో గుడ్లను చేర్చుకోవచ్చు. ఇందులో తగినంత ప్రోటీన్ మరియు ఐరన్ ఉన్నాయి. కాల్షియం, విటమిన్ బి, పొటాషియం కూడా గుడ్లలో ఉంటాయి.