భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు డెంగ్యూ తీవ్రమైన సమస్యగా మారుతోంది. ప్రపంచ జనాభాలో సగం మంది డెంగ్యూ ప్రమాదంలో ఉన్నారు.
ప్రతి సంవత్సరం 100-400 మిలియన్ల మంది దీని బారిన పడుతున్నారు. డెంగ్యూ రాకుండా ముందుగా జాగ్రత్త పడాలంటున్నారు వైద్య నిపుణులు.
ప్లేట్‌లెట్స్ బాడీలోని రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. ప్లేట్‌లెట్స్ తగ్గితే రక్తం గడ్డకట్టదు. ఈ కారణంగా.. శరీరంలోని వివిధ భాగాలకు రక్తస్రావం ఎక్కువగా అయి బలహీనపడతారు.
ప్రతి ఒక్కరి రక్తంలో 2.5 లక్షల నుంచి 4 లక్షల ప్లేట్ లెట్స్ ఉండాలి. ఇవి తగ్గితే కౌంట్ తగ్గిందని అర్ధం.
డెంగ్యూ సోకినప్పుడు ఎక్కువగా ద్రవ పదార్ధాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.