నిద్ర విషయంలో తాజా అధ్యయనం ఏమి చెబుతుందంటే..

TV9 Telugu

06 January 2024

ఎంత సేపు నిద్రపోయాం అన్నది కాదు.. నిద్ర ఎంత గాఢంగా ఉందన్నది ముఖ్యమని చెబుతుతున్నారు ఆరోగ్య నిపుణులు.

తాజాగా పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో నిద్ర సమయం, గాఢమైన నిద్ర గురించి కొన్ని షాకింగ్ వాస్తవాలు బయటపడ్డయి.

30 నుంచి 40 ఏళ్ల వ్యక్తుల నిద్రలో పదే పదే అంతరాయాలు ఉంటే.. అలాంటి వారు పదేళ్లలో ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువ.

అల్జీమర్స్‌ వ్యాధి లక్షణాలు బయటపడటానికి అనేక ఏళ్ల ముందే, మెదడులో వ్యాధి పేరుకుంటుందని అధ్యయనంలో తేలింది.

నిద్రకు, జ్ఞాపకశక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నాక అల్జీమర్స్‌ చికిత్సకు అవకాశం మెరుగైందని అన్నారు.

సగటు 40 ఏళ్ల వయస్సు కలిగిన దాదాపు 526 మంది వ్యక్తుల నిద్ర సమయాన్ని తాజాగా సైంటిస్టులు అధ్యయనం చేశారు.

మధ్య వయస్సులో ఉన్న ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర చాలా అవసరమని తాజాగా ఈ అధ్యయనంలో తేల్చిచెప్పారు సైంటిస్టులు.

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో సైంటిస్టుల అధ్యయనం ‘జర్నల్‌ ఆఫ్‌ న్యూరాలజీ’లో ప్రచురితమైంది.