మొలకెత్తిన గింజలు ఈ టైంలో తింటే జీవితంలో షుగర్ రాదు

11 November 2024

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కాసిన్ని పెసర్లు నానబెట్టి మొలకలు వచ్చాక తినడం ఎంతో ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. పెసలు, శెనగలు, గోధుమలు లాంటి గింజలు మొలకలు వచ్చిన తర్వాత తినడం వల్ల శక్తి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

ముఖ్యంగా మొలకెత్తిన పెసలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. రుచి కూడా బాగుంటుంది. అందుకే చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడతారు

TV9 Telugu

పెసలు మొలకల్లో పీచు, ప్రొటీన్, ఐరన్, విటమిన్ ఎ, బి6, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం వంటి అనేక పోషకాలు అధికంగా ఉంటాయి

TV9 Telugu

మొలకెత్తిన గింజల్లో ముఖ్యంగా జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఈ ఎంజైమ్‌లు ప్రొటీన్లను, శరీరానికి ఉపయోగపడే ఎమైనో ఆమ్లాలను, పిండి పదార్థాన్ని గ్లూకోజ్‌గా తయారు చేస్తాయి

TV9 Telugu

ఇందులో ఉండే విటమిన్‌ కె రక్తం గడ్డ కట్టడానికి, కాలేయ పనితీరు సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది. మొలకెత్తిన గింజధాన్యాలు త్వరగా జీర్ణమవుతాయి

TV9 Telugu

మొలకలను ఉదయాన్నే తింటే, ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీని వల్ల అందులో ఉండే ప్రోటీన్, వివిధ పోషకాలు శరీరం బాగా శోషిస్తుంది. మొలకలు తినడం వల్ల రెట్టింపు లాభాలు వస్తాయి

TV9 Telugu

మొలకలు తీసుకోవడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. వీటిని పచ్చిగా లేదంటే ఉడకబెట్టి కూడా తినవచ్చు. ముడి మొలకల్లో బ్యాక్టీరియా, ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే ఉడకబెట్టి తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

మొలకలలో కేలరీలు తక్కువ, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. దీంతో ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది