పచ్చదనానికి, ఎముక పటుత్వానికి సంబంధం ఏంటి?

TV9 Telugu

18 January 2024

పరిసరాల పచ్చదనం అధికంగా ఉన్న చోట నివసించే వారి ఎముకలు బలంగా ఉంటాయని చెబుతున్నారు వైద్యారోగ్య నిపుణులు.

‘వయసుపై పర్యావరణ ప్రభావం’ అనే అంశంపై బెల్జియంలో 4-6 ఏళ్ల వయసున్న 327 మంది పిల్లలపై పరిశోధనలు నిర్వహించారు.

ముఖ్యంగా ఆ పిల్లల శరీరంలో ఎముకల పటిష్ఠతను పరిశీలించారు బెల్జియం ఆరోగ్య పరిశోధకులు, వైద్యులు, శాస్త్రవేత్తలు.

ఎముకలోని ఖనిజ సాంద్రత కనుగొనడానికి వారు అల్ట్రా సోనోగ్రఫీ లాంటి ఆధునిక విధానాలను వినియోగించారు పరిశోధకులు.

25 శాతం పచ్చదనం ఉన్న ప్రాంతాలకు వెయ్యి మీటర్ల పరిధిలో నివసించే పిల్లల ఎముకల్లో బలాన్ని గమనించారు శాస్త్రవేత్తలు.

పచ్చదనం పిల్లల ఎముకల పటిష్టతపై విశిష్ట ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో వెల్లడించారు వైద్యారోగ్య పరిశోధకులు.

చిన్నతనంలోనే ఎముకల్లో బలం ఉంటే తర్వాత జీవితంలో వీరు మరింత దృఢంగా మారుతారని ఈ సర్వేలో పరిశోధకులు తెలిపారు.

అందుకే ఇంటి చుట్టూ పచ్చని వాతావరణం ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల ఎముకలు బలంగా మారడమే కాదు.. ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు.