అతిగా డ్యాన్స్‌ చేస్తే ఏమవుతుంది? ఆయాసం రాగానే ఏం చేయాలి?

24 October 2023

గుజరాత్‌లో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో గర్బా ఈవెంట్‌లో డ్యాన్స్ చేస్తూ 12 మంది మృతి చెందారు.

బాధితుల్లో యువకుల నుంచి 50 ఏళ్లు పైబడ్డ వారున్నారు. డ్యాన్స్ చేసిన వీరిలో అత్యంత పిన్న వయస్కుడు దభోయికి చెందిన 13 ఏళ్ల బాలుడు.

గర్బాలో సామూహికంగా డాన్స్ చేస్తారు. శారీరక పరిమితికి మించి నృత్యం చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మూడు గంటల పాటు నృత్యం చేయడం వలన గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు.

అధిక సమయం నృత్యం చేసినప్పుడు గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. డీహైడ్రేషన్‌తో సమస్యలు ఎదురవుతాయి

రక్తపోటు పెరగడం అదే సమయంలో హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో శరీరానికి ఆక్సిజన్ అవసరం.

డ్యాన్స్ చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వెంటనే విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

డ్యాన్స్ పరిమితి చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి.. అలాగని అతిగా చేయడం వల్ల గుండె జబ్బులు మరణం చేరువయ్యే అవకాశం ఉంది.