తప్పు బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే ఏమవుతుంది..?
TV9 Telugu
31 March 2024
బ్లడ్ గ్రూపులు ప్రధానంగా నాలుగు. ఎ, బి, ఓ, ఏబీ, వాటిలో పాజిటివ్, నెగిటివ్ ఇలా ఎనిమిది రకాలు ఉన్నాయి.
ఎవరికైనా రక్తం దానం చేయాలన్నా, లేక మీరు ఎవరి నుంచి రక్తం పొందాలన్నా అందుకు సంబంధించి కనీస అవగాహన ఉండాలి.
ఒక వ్యక్తికి తప్పు గ్రూపు రక్తాన్ని ఎక్కించడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు.
మరొక గ్రూపునకు సంబంధించి రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ చెదిరిపోవచ్చు. వ్యక్తికి భారీగా రక్తస్రావం జరగవచ్చు.
ఇతర గ్రూపునకు సంబంధించిన రక్తాన్ని ఎక్కించడం ద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు శరీరంలో వ్యాప్తి చెందుతాయి.
మూత్రపిండాలు, గుండెపై చెడు ప్రభావాలను కలిగిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారి దెబ్బతినవచ్చు.
తప్పు గ్రూపు రక్తం ఎక్కించడం ద్వారా రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. ఆ వ్యక్తి చర్మంపై అలెర్జీ రావచ్చు.
తప్పు గ్రూపు రక్తం ఎక్కిస్తే మీకు అలసట లేదా మైకము అనిపించవచ్చు. శరీర రంగు పసుపు రంగులో సమస్య ఉండవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి