తరుచూ వేరుశనగలు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంటుందని ప్రజలు చాలామంది భావిస్తుంటారు.
అయితే డయాబెటిక్ ఉన్న రోగులు వేరుశెనగ తీసుకోవడం సురక్షితమైనదిగా పరిగణిస్తున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్, వేరుశనగలో పుష్కలంగా ఉంటుంది. డయాబెటిక్ రోగులు వేరుశెనగను అతిగా తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేరుశనగలో ఉండే కొవ్వు పదార్ధం అధికంగా శరీరంలో చేరేతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
వేరుశెనగ మితంగా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉండటమే కాకుండా, కార్డియోవాస్కులర్ డిసీజ్ నుంచి రక్షణ లభిస్తుంది.
వేరుశనగలో శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
వేరుశెనగను శీతాకాలంలో తింటే తక్షణ శక్తిని ఇస్తుంది. చల్లని వాతావరణంలో రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.
వేరుశనగలో ఉన్న పొటాషియం, కాపర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు జీర్ణక్రియను పెంపొందిస్తాయి.