రాత్రి భోజనానికి దీర్ఘాయుష్షుకు సంబంధం ఏంటి.?
TV9 Telugu
21 August 2024
రాత్రి భోజనానికి దీర్ఘాయుష్షుకు మధ్య సంబంధం ఉందని ఆరోగ్య నిపుణులు కొన్ని అధ్యయనాల ద్వారా నిర్థారించారు.
ప్రతి వారు ఆరోగ్య శ్రేయస్సు, దీర్ఘాయువును ప్రోత్సహించే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవాలని చెబుతున్నారు.
వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరి శరీరంలో కొన్ని రకాల మార్పులు రావడం సహజం. సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.
ఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటి వన్నీ ఆరోగ్యంతో పాటు ఆయుష్షు కూడా ఇస్తాయి అని అంటున్నారు.
ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయనం చేశారు ఆరోగ్య నిపుణులు.
ఇటలీలో 90 నుంచి 100 సంవత్సరాల వయస్కులు ఎక్కువగా ఉండే ఎల్ అక్విలాలో ఆరోగ్య నిపుణులు ఈ పరిశోధన చేసారు.
వీరిలో అత్యధికులు రాత్రి 7 గంటలలోపే భోజనం చేస్తారని గుర్తించారు. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తింటారని తెలుసుకున్నారు.
తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు తింటారని మాంసం, ప్రాసెస్డ్ మీట్ తక్కువగా తీసుకుంటారని అధ్యయనంలో గుర్తించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి