ఎండ ఎరగక విటమిన్‌ డీని కొంటున్నారు

TV9 Telugu

10 April 2024

ప్రకృతి సిద్ధంగా లభించే దివ్యౌషధం విటమిన్‌ డి. నయాపైస ఖర్చులేకుండా సూర్య కిరణాలు తెచ్చి ఇచ్చే విటమిన్‌ ఇది.

విటమిన్ డి కొవ్వులో కాల్షియం శోషణకి చాలా ముఖ్యమైనది. విటమిన్ డి ఆరోగ్య కణాల పెరుగుదలకు సహాయపడుతుంది.

నగరాల్లో లేలేత ఎండ ఇంట్లోకి చొరబడే అవకాశం లేకపోవడంతో ఈ పరిస్థితి కనుక పొద్దున్నే వాకింగ్‌ చేయడం చక్కని పరిష్కారం.

మన దేశ జనాభాలో 50 శాతం మందికి విటమిన్‌ డి లోపం ఉందని అంచనా. ఇందులో 30 శాతం మంది చిన్నారులు, యువత ఉండటం ఆందోళన కలిగించే విషయం.

విటమిన్‌ డి శరీరానికి సరిపడా అందకపోతే రోగనిరోధకశక్తి తగ్గుతుంది. నీరసం ఆవహిస్తుంది. ఎముకలు బలహీనమవుతాయి.

విటమిన్‌ డి లోపాన్ని అధిగమించడానికి వందల రూపాయలు వెచ్చించి విటమిన్‌ డి సప్లిమెంట్స్‌ కొంటున్నారు నగరవాసులు.

అయితే, ఔషధాలపై ఆధారపడటం కంటె పొద్దున్నే ఓ ఇరవై నిమిషాల పాటు డాబాపై నిలబడి సూర్యభగవానుడి సేవ చేసుకోవడమే మంచిది.

ప్రతిరోజూ తెల్లవారుజామునే ఎండలో నిలపడటం వల్ల సూర్యుని కిరణాలు మీకు విటమిన్ డీ చాల సులభంగా లభిస్తుంది.