బలహీనతతో ఇబ్బంది పడుతున్నారా..? ఇవి తింటే బాహుబలిలా మారాల్సిందే..

03 April 2024

Shaik Madar Saheb

మన శరీరం అభివృద్ధి చెందడానికి అనేక రకాల పోషకాలు అవసరం.. అందుకే మంచి పోషకాహారాలను తీసుకోవాలి.

అలాంటి ముఖ్యమైన పోషకాలలో ఒకటి విటమిన్ బి 12 ఒకటి.. దీని లోపం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఈ పోషకాలను పొందకపోతే, బలహీనత, అలసట, ఆకలి లేకపోవడం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, చేతులు- కాళ్ళు తిమ్మిరి వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. 

ఆరోగ్యవంతమైన ప్రతి వ్యక్తికి ప్రతిరోజూ 2.4 మైక్రోగ్రాముల విటమిన్ B12 అవసరం.. దీనికోసం కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. 

గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోటీన్, సహజ కొవ్వుతో పాటు, విటమిన్ B12 కూడా ఇందులో పెద్ద పరిమాణంలో ఉంటుంది. 

మాంసంలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. దీనిలో ప్రోటీన్లు, కొవ్వులు ఉన్నాయి. ఇది మన శరీర అభివృద్ధికి అవసరమైనవి.

సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్ పోషకాలకు మూలం.. వీటిని విటమిన్ బి 12తో ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. 

విటమిన్ B12 పాలు, అన్ని పాల ఉత్పత్తులలో మంచి పరిమాణంలో లభిస్తుంది. అందుకే రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.