మౌత్ వాష్ వల్ల ఇన్ని నష్టాలా..
TV9 Telugu
03 July 2024
మౌత్ వాష్ అనేది బ్రష్ చేసిన తర్వాత మన సాధారణ జీవితంలో భాగమైన నోటిని శుభ్రం చేసే ప్రక్రియ. దీనికోసం మౌత్ వాష్ వాడుతారు.
మంచి, చెడు బాక్టీరియా రెండూ మన నోటిలో ఉంటాయి. కాబట్టి మౌత్ వాష్‌తో మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది.
అయితే మంచి బ్యాక్టిరియా మన ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి మౌత్‌వాష్ వల్ల జీర్ణక్రియకు కీడు చేస్తుంది.
మౌత్ వాష్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల నోరు పొడిబారుతుంది. దీనివల్ల అనేక సమస్యల వస్తాయని అంటున్నారు నిపుణులు.
ఉదయాన్నే మౌత్ వాష్ ఉపయోగించిన తర్వాత మీరు పళ్లు తోముకుంటే మీరు నొప్పి మరియు సున్నితత్వంతో బాధపడవచ్చు.
మీరు ఎక్కువగా మౌత్ వాష్ ఉపయోగిస్తే మీ చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరగవచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మౌత్ వాష్ వాడకం అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు వైద్యులు.
మౌత్ వాష్ మీకు సరిపోకపోతే, మీకు ఈ సమస్యలు ఏవైనా ఉంటే, వెంటనే మౌత్ వాష్ వాడటం మానేయడం ఉత్తమం అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి