స్మోకింగ్ మానలేకపోతున్నారా.. ఈ చికిత్స మీ కోసమే..
TV9 Telugu
14 January 2024
స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ దేశవ్యాప్తంగా చాలామంది స్మోకింగ్ చేస్తూనే ఉన్నారు.
కానీ.. ఆ వ్యసనాన్ని వదలించుకోవాలనుకున్నా ఆ పని చేయలేకపోతున్నవారే ఎక్కువగా ఉన్నారని తేల్చేసారు నిపుణులు.
ఇందుకు కారణం... పొగాకు ఉత్పత్తుల్లోని నికొటిన్‌కు అలవాటు పడటమే అంటున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు.
పొగాకు ఉత్పత్తుల ద్వారా కాకుండా వేరే రూపాల్లో నికోటిన్ అందించి వ్యసనాన్ని మాన్పించడానికి వైద్యులు ప్రయత్నిస్తుంటారు.
దీన్ని నికొటిన్ స్థానభ్రంశ చికిత్స అంటారని చెబుతున్నారు నిపుణులు. దీని ద్వారా అలవాటు పోతుంది అంటున్నారు.
మొక్కల నుంచి తీసిన సైటిసైన్ అనే పదార్థాన్ని మాత్రల రూపంలో తీసుకుంటే ఈ చికిత్స ఇంకా ఎక్కువ సమర్థంగా పనిచేస్తుందని ప్రయోగాల్లో తేలింది.
అర్జెంటీనా దేశానికు చెందిన పరిశోధకులు 6,000 మంది స్మోకర్లపై పై ప్రయోగాలు చేసి ఈ అంశాన్ని నిర్ధారించారు.
మొక్కల నుంచి తీసిన సైటిసైన్ ఉపయోగించడం వల్ల చాలామంది స్మోకింగ్ అలవాటు దారమైనట్టు తెలిపారు పరిశోధకులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి