పుట్టగొడుగులు శాఖాహారులు ఇష్టంగా తింటుంటారు. నిత్యం ఆహారంలో పుట్టగొడుగులు చేర్చుకుంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే ఈ పోషకాలన్నీ అందుతాయి.
కొన్ని అధ్యయనం ప్రకారం బలహీనమైన జ్నాపకశక్తి, భాష సమస్యలు, బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి.
పుట్టగొడుగులు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఈ బ్యాక్టీరియా నరాల మధ్య సందేశాలను ప్రసారం చేసే న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి సహాయపడతాయి.
పుట్టుగొడుగు నరాల కణజాలాల ఉత్పత్తిని రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ వ్యాధి, మొద్దుబారిన మెదడు, వయస్సు సంబంధిత మానసిక రుగ్మతల నుంచి కాపాడుతుంది.
మష్రూమ్స్ లో ఉండే లినోలిక్ యాసిడ్ యాంటీ కార్సినోజెనిక్ కాంపౌండ్ గా పనిచేయడంతోపాటు శరీరంలో అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు కలిగి ఉండే హానికరమైన ప్రభావాలను తొలగించేస్తుంది. రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.
పుట్టగొడుగులు బ్యూటీ ప్రొడక్టులలోకూడా ఉపయోగిస్తుంటారు. వీటిని మన డైట్లో చేర్చుకుంటే చర్మం ముడతలు తగ్గి, కణాలను పునరుజ్జీవింప చేయడంలోనూ సహాయపడుతుంది.