పతి రోజు లవంగం తినండి.. ఈ వ్యాధులన్నీ మటుమాయం

TV9 Telugu

07 June 2024

లవంగాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇవి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు.

జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు రోజు కేవలం రెండు లవంగాలు నమలండి చాలు మార్పు మీరు గమనిస్తారు. జీర్ణ వ్యవస్థ మెరుగుగా పని చేస్తుంది.

జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లైతే లవంగాలు బెస్ట్‌ రెమెడిగా చెప్పొచ్చు. జలుబు, దగ్గును దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

లవంగాల్లో విటమిన్-బి1, విటమిన్-సి, బీటా కెరోటిన్ వంటి మంచి గుణాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. 

లవంగాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లైంగిక సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇందులోని కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ మూలకాలు పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

ముఖ్యంగా గోరు వెచ్చిన నీళ్లలో లవంగాలను నానబెట్టి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి దూరం కావొచ్చు.