చింత చిగురు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా !!
TV9 Telugu
24 April 2024
ఈ కాలం లో యువతకు చాలా మందికి చింత చినుగురుతో వంట చేసుకుంటారన్న విషయం తెలియదు. వాటి ప్రయోజనాలు అస్సలు తెలియవు.
కానీ పల్లెటూర్లలో ఉండేవారికి చింత చిగురు చేసుకునే వంటల గురించి కానీ వాటి ప్రయోజనాలు గురించి ఎక్కువగా తెలిసి ఉంటాయి.
పల్లెటూర్లలో ఉన్న వారు లేదా సమ్మర్ హలీడేస్ రాగానే చాలా మంది తమ అమ్మమ్మ, తాతయ్య ఊర్లకు వెళ్తుంటారు. మధ్యహ్నా పూట పొలాలకు చింత చిగురు తెచ్చుకుంటారు.
చింత చిగురు లో ఫైబర్ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని బెల్లీఫ్యాట్ ను దూరం చేస్తుంది.
చింత చిగురును ప్రతి రోజు మనం తినే ఆహారంలో ఉపయోగిస్తే జీర్ణ సమస్యలు మెరుగై అజీర్తి సమస్యలు దూరమైపోతాయి.
చింత చిగురును రాత్రి పూట నీళ్లలో వేసుకుని పెట్టుకొవాలి. ఉదయంపూట ఆ నీళ్లను తాగితే గొంతు సమస్యలు, మంట, వాపు, అన్ని చిటికెలో దూరమైపోతాయి
కొందరికి పొట్టలో నులిపురుగుల సమస్య ఉంటుంది. ఇలాంటి వారు చింత చిగురును తింటే ఆ బాధలు దూరమైపోతాయి. ఇమ్యునిటీ కూడా పెరుగుతుంది.
చింత చిగురును తినటం వల్ల రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది. ఎముకలు గట్టి పడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి