ప్రస్తుతం వస్తున్న హెల్త్ ప్రాబ్లెమ్స్ వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. దాని కోసం నట్స్, సీడ్స్, మొలకెత్తిన విత్తనాలను తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే వీటి లో గుమ్మడి గింజలు కూడా ఒకటి.. ఇవి తినడానికి కూడా బాదంపప్పులా రుచిగా ఉంటాయి. అంతే కాదు దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ప్రతి రోజు గుమ్మడి గింజలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో.. రోజూ ఎంతమేర ఈ గుమ్మడి విత్తనాలను తినాలో ఇప్పుడు తెల్సుకుందాం.
బరువు తగ్గాలనుకునేవారు ఎలాంటి డౌట్ లేకుండా ఈ విత్తనాలు తినొచ్చు. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి.. చెడు కొలెస్ట్రాల్ కరుగుతాయి.
గుమ్మడి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
వీటిలో ఉండే మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. పురుషులలో వీర్య కణాల నాణ్యత కూడా పెరుగుతుంది. అంతే కాదు గుమ్మడి గింజలతో నిద్రలేమి సమస్య తొలగించవచ్చు.
గుమ్మడి విత్తనాలను డైరెక్ట్ గా అలానే తినే కంటే నీటిలో నానబెట్టి తినడం కానీ దోరగా వేయించికానీ తినాలి. అప్పుడే మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది.