ఆలు గడ్డ జ్యుస్ తో అద్భుత ప్రయోజనాలు

Phani.ch

20 May 2024

బంగాళదుంపను కూరగాయలలో రారాజుగా పిలుస్తారు. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు బంగాళాదుంప తినటానికి ఇష్టపడతారు.

కానీ ఎంత ఇష్టం ఉన్న బంగాళాదుంప తింటే గ్యాస్ వంటి సమస్య వస్తాయని తినటానికి సందేహిస్తుంటారు చాలామంది. 

బంగాళదుంపల గురించిన అపోహలన్నింటినీ పక్కన పెట్టి బంగాళదుంపలు తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

బంగాళదుంప లోని కార్బోహైడ్రేట్ శరీరంలోని రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చేస్తుంది. అయితే బంగాళదుంప రసం తాగితే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

ఓ నివేదిక ప్రకారం.. బంగాళదుంప రసం తాగడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాల తగ్గుతాయట అంతే కాదు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు  ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

మైగ్రేన్ బాధితులు బంగాళదుంప రసం తాగడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఈ రసం బరువు తగ్గడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది.

 అధిక రక్తపోటును తగ్గించడంలో, చర్మ సమస్యలు నివారించడంలో, చర్మాన్ని ముడతలు పడకుండా కూడా కాపాడుతుందని ఈ బంగాళాదుంప రసం.

బంగాళాదుంప రసం హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతే కాదు కిడ్నీ స్టోన్ సమస్యల నుండి బయటపడవచ్చు.