ఆల్‌బుఖరాతో
అద్భుత ప్రయోజనాలు
TV9 Telugu
08 JULY 2024
సీజనల్‌గా లభించే ఆల్‌బుఖరా తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ పండు ఒక పోషకాల గని.
పలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా వుండాలంటే ఈ పండ్లను తినాలి. వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందా
ము.
ఆల్‌బుఖరా పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని రోజువారీ ఆహారంలో సిఫార్సు చేసిన ఫైబర్‌లో 4% వీటి ద్వారా లభిస్తుంది.
ఆల్‌బుఖరా పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు సమస్యను నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
ఆల్‌బుఖరా పండ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో వున్న విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఐరన్ లోపంతో బాధపడేవారు ప్లమ్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతుంది.
ఆల్‌బుఖరా పండ్లలోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో సహాయపడటమే కాకుండా ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
ఆల్‌బుఖరా పండ్లు రోగనిరోధక శక్తి పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడి సాధారణ జలుబు, ఫ్లూ వంటి సమస్యలు బారిన పడకుండా సహాయపడతాయి.
ఇక్కడ క్లిక్ చేయండి