ప్రతి రోజు లవంగం తింటే కలిగే ప్రయోజనాలు చూస్తే ఆశ్చర్యపోతారు 

TV9 Telugu

05 April 2024

మనలో చాలామంది అన్నం తిన్నాక లవంగాలు, యాలకలు తింటుంటారు. అయితే లవంగాలు తినటం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు,

లవంగాలను సుగంధ ద్రవ్యాలకు రాజుగా చెబుతుంటారు. అందుకే ఇంట్లో స్పైసీ వంటకాలు ఏవి చేసిన   లవంగాలను తప్పుకుండా ఉపయోగిస్తారు

లవంగాలు లేనిదే స్పైసీ వంటకాలుకు అస్సలు టెస్ట్ రాదు. అందుకే లవంగాలకు మార్కెట్ లో ఆ రెంజ్ లో డిమాండ్ ఉంది.

లవంగం ప్రతి రోజు తీసుకోవడం వల్ల నోటి చిగురుకున్న దంత సమస్యలను దూరం చేస్తుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. 

కొంతమందికి  బస్సుల్లో జర్నీ అస్సలు పడదు వామిటింగ్ చేస్తుంటారు. అలాంటి వారు  లవంగం నోటిలో వేసుకుంటే.. వామిటింగ్ సెషన్ ఉండదు.

సీజనల్ చేంజ్ వల్ల జలుబు, దగ్గులు వస్తుంటాయి. ఇలాంటి వారికి లవంగం పౌడర్, మిరియాలను మిక్స్ చేసి తాగితె ఉపశమనం ఉంటుంది. 

తలనొప్పితో బాధపడేవారు, బీపీలు ఉన్నవారికి లవంగం బాగా పనిచేస్తుంది. ఆంతే కాదు కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. 

కీళ్ల నొప్పులతో బాధపడేవారు, అజీర్తిస సమస్యలు, పొట్ట ఉబ్బటం, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి లవంగం ఎంతో ఉపశమనం కల్గచేస్తుంది.