పచ్చి బఠానీలు తింటే ఈ వ్యాధులన్నీ పరార్

TV9 Telugu

20 June 2024

పచ్చి బఠానీలు అనేక పోషకాల మూలం.. అంతే కాదు తినడానికి కూడా మంచి రుచికరంగా ఉంటాయి. ఒక కప్పు పచ్చి బఠానీలు విటమిన్, మినరల్స్‌ ఉంటాయి.

పచ్చి బఠానీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. అంటే అవి తినగానే మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు.

పచ్చి బఠానీలు అధిక ఫైబర్ కూడా కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది.  

 పచ్చి బఠానీలు జీర్ణ ఆరోగ్యానికి చాలా మంచివి. దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. 

 బఠానీలు, ముఖ్యంగా పచ్చి బఠానీలు, గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  అంతే కాదు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయనే దానికి కొంత ఆధారాలు ఉన్నాయి.

 పచ్చి బఠానీలోని యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలకు మంచి మూలం, ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.   

 పచ్చి బఠానీలు మాంగనీస్, ఫాస్పరస్‌కు మంచి మూలం. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో రక్షించడంలో సహాయపడతాయి..