అవిసె గింజలతో అద్భుత ప్రయోజనాలు

Phani CH

30 SEP 2024

అవిసె గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే అవి ప్రతి రోజు తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, లిగ్నన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అవిసె గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

రోజూ అవిసె గింజలను తీసుకోవడం వల్ల మీ బాడీలో ALA పెరుగుతుంది. ఇది మంటను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరు బాగుండేలా చేస్తుంది.

అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను, సాధారణ పేగు కదలికలను పెంచుతాయి. రోజూ అవిసె గింజలను తినడం మలబద్దకాన్ని నివారించవచ్చు.

అవిసె గింజలలో లిగ్నన్లు ఉన్నాయి. ఇవి రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని హార్మోన్ సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి. మెనోపాజ్ సమస్యల్ని నివారిస్తాయి.

అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది.

అవిసె గింజలు అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి, ఇవి త్వరగా ఆకలి వెయ్యనివ్వవు. ఫలితంగా బరువు తగ్గుతారు.