ఒక్క డ్రాగన్ ఫ్రూట్‌ తో బోలెడు లాభాలు

TV9 Telugu

23 JULY 2024

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మనిషి జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉంటే ఫైబర్ శరీరానికి ఎంతో అవసరం.

ఫైబర్ తగినంత శరీరానికి అందకపోతే మలబద్ధకం తీవ్రంగా వేధిస్తుంది. దీని వల్ల ఎన్నో రోగాలు కూడా చుట్టుముడతాయి. 

ఇదే కాకుండా ఐరన్, జింక్, మాంసకృత్తులు, పాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఈ పండులో ఎక్కువగా ఉంటాయి.

నీరసంగా ఉన్నవారు త్వరగా యాక్టీవ్ అవ్వడానికి  డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు కొంచెం తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇందులోని మెగ్నీషియం హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో వాటర్ కంటెంట్ , పీజు పదార్థం చాలా ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థన సాఫీగా పనిచేసేలా చేస్తుంది

డ్రాగన్ ఫ్రూట్‌లో పిటయా అనే పోషక పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం లో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. 

డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో దీటుగా పోరాడతాయి.ఇందులోని పోషకాలు క్యాన్సర్ బారిన పడకుండా అడ్డుకుంటాయి.