మట్టికుండలోని నీరు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో

TV9 Telugu

11 April 2024

మన భారతీయ సంప్రదాయ పద్ధతుల్లో మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ఒకటి. సింధు నాగరికత కాలం నుంచి ఇదే పద్దతి పాటిస్తున్నాం.

ఈ మధ్య కాలంలో ఇతర దేశాల వారు కూడా ఇదే పద్దతిని పాటిస్తున్నారు. ఎందుకంటే కుండలో నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి తెలుసుకుందాం.

కుండల తయారీకి ఉపయోగించే మట్టి నీటిని సహజంగా ఫిల్టర్ చేస్తుంది. ఇందులో పోరస్ లక్షణాలు ఉండటం వల్ల మలినాలు తొలగించి తాగేందుకు అనుకూలంగా మార్చుతాయి.

కుండల తయారీ మట్టిలో ఆల్కలీన్ లక్షణాలు ఉంటాయి.  ఇవి నీటిలో pH స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఆల్కలీన్ నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

అంతేకాదు మన శరీరంలోనే జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది, పొట్టలో యాసిడ్ తగ్గేలా చేస్తుంది.

కుండ మట్టిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నీటిలోకి వెళ్లి అదనపు పోషక ప్రయోజనాలను అందిస్తాయి.

మట్టి కుండలో పోసిన నీరు వేడి వాతావరణంలో కూడా చల్లగా, తాజాగా ఉంచుతాయి.  ఈ నీటిని తాగితే వడదెబ్బ తగిలే అవకాశం తక్కువ. 

మట్టి కుండలకు చిన్న చిన్న కన్నాలు ఉంటాయి. ఈ కన్నాల నుంచి గాలి కుండలోపలికి వెళ్తుంది. తద్వారా లోపలి నీరు చల్లగా అవుతుంది.